
ఉద్యమం ఆగదు
డిమాండ్‌లను సాధించుకునేందుకు మొదట ఉద్యమాన్ని లేవదీసింది ఉపాధ్యాయ సంఘాలే. ఎట్టకేలకు 16 నెలల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపడటం సంతోషాన్ని ఇచ్చింది. అయితే చర్చలు మాకు సంతృప్తిని ఇవ్వలేదు. ముఖ్యమంత్రితో చర్చలంటే దాదాపు అన్ని డిమాండ్‌లకు పరిష్కారం లభించాలి. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండగా.. కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇవ్వడం తీవ్ర నిరాశను మిగిల్చింది. 12వ పీఆర్‌సీ లేదు. ఐఆర్ ఊసే లేదు. ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది. పీఆర్‌సీ, ఐఆర్ సాధించుకునేందుకు మా ఉద్యమం ఆగదు.
– హృదయరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
కేవలం ఒక్క డీఏకు ఉద్యోగ సంఘాల నేతలు సంబరపడుతుండటం చూస్తుంటే బాధ కలుగుతోంది. ప్రభుత్వంతో కోట్లాది రూపాయల విలువ చేసి డిమాండ్‌లు సాధించుకున్నాం అన్నట్లుగా ఉద్యోగ సంఘాలు గొప్ప స్టేట్‌మెంట్లు ఇస్తుండటం దారుణం. ఒక్క డీఏతో సంబరపడిపోతూ.. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారనే విధంగా ప్రకటనలు ఇస్తుండటం చూస్తే బాధేస్తోంది. ఇప్పటికై నా మిగిలిన మూడు డీఏలు, పీఆర్‌సీ, ఐఆర్ ఇతర డిమాండ్‌లు సాధించుకోవడానికి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. – గిరికుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు,
ఉమ్మడి జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం, కర్నూలు
●

ఉద్యమం ఆగదు