
బ్రహ్మనందీశ్వర ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన సేవ
నంద్యాల(వ్యవసాయం): కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని కోటా వీధిలో వెలసిన శ్రీబ్రహ్మనందీశ్వరస్వామి దేవస్థానంలో మన ఊరు–మన గుడి, మన బాధ్యత సభ్యులు కోయిల్ ఆల్వార్ తిరుమంజన సేవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో చెత్తా చెదారం, పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు ఆలయ గోపురాలను శు భ్ర పరిచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గుంటూరు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ 100 మందికి పైగా సభ్యులచే గుడిని శుభ్రం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా పాత బడిన దేవుళ్ల ఫొటోలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ సభ్యులకు అందజేస్తే తాము వాటిని విసర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో హరికృష్ణ, డాక్టర్ కార్తీకమ్మ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.