
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..
సహకార సంఘాలను లాభాల బాట పట్టించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మల్టీపర్పస్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు పలు చర్యలు తీసుకుంది. ఇందుకోసం జిల్లా సహకార కేంద్రబ్యాంకులో ప్రత్యేకంగా ప్యాక్స్ డెవలప్‌మెంటు సెల్ ఏర్పాటు చేసి ఆప్కాబ్‌లో పనిచేసే సీనియర్ మేనేజర్, ఏజీఎం స్థాయి అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఏఏ సంఘం ఎలాంటి వ్యాపారాల్లో రాణించేందుకు ఆసక్తి చూపుతుందో అందుకు అనుగుణంగా ఈ సెల్ డీపీఆర్‌లు సిద్ధం చేస్తుంది. ఇందుకు అనుగుణంగా డీసీసీబీ, ఆప్కాబ్ సంఘాలకు నిధులు ఇచ్చేది. గత ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలతో సహకార సంఘాలు లాభాల బాట పట్టాయి. సంఘాలకు సొంత భవనాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు అయ్యాయి. కొన్ని సంఘాలకు పెట్రోలు పంపులు కేటాయించారు. పలు సంఘాలకు జీవనధార మందుల దుకాణాలు కూడా ఇచ్చారు. బంగారంపై రుణాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. కొన్ని సంఘాలు బియ్యం వ్యాపారం కూడా చేస్తున్నాయి. సంఘాలకు అనుబంధంగా మల్టీపర్సప్ గోదాములు కూడా నిర్మించారు.