కర్నూలులో కదంతొక్కిన మహిళలు | - | Sakshi
Sakshi News home page

కర్నూలులో కదంతొక్కిన మహిళలు

Oct 14 2025 7:27 AM | Updated on Oct 14 2025 7:35 AM

ప్రజల ప్రాణాలతో చెలగాటమా.. నాణ్యమైన మద్యమంటే నకిలీనా..

సీబీఐతో విచారణ

చేయించాలి

ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రాష్ట్రంలో వెలుగుచూసిన భారీ నకిలీ మద్యం రాకెట్‌ వ్యవహా రంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ పాత్ర ఉందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. నకిలీ మద్యంపై సిట్‌ చేత దర్యాప్తు చేయిస్తామని చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. – కాటసాని రాంభూపాల్‌రెడ్డి,

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు

టీడీపీ నాయకులు డబ్బు కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి దర్జాగా అమ్ముతున్నా పట్టించుకునేవారు లేరు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో కనీసం బెల్ట్‌షాప్‌లు కూడా ఉండేవి కావు. ఇప్పుడు ఏ ఊరు చూసినా నకిలీ మద్యం, బెల్ట్‌ షాపులే కనిపిస్తున్నాయి. నకిలీ మద్యం గుట్టు వీడాలంటే సీబీఐతో దర్యాప్తు చేపట్టాల్సిందే.

– గంగుల బిజేంద్రారెడ్డి,

ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే

ఎన్నికల ముందు కూటమి నేతలు నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని చెప్పి ఇప్పుడు నకిలీ మద్యాన్ని ప్రజలకు అంటగడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుంది. నకిలీ మద్యం గుట్టు పూర్తిగా వీడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా వైన్‌షాపులు, బార్‌లు, బెల్ట్‌ షాపుల్లో ఎకై ్సజ్‌ శాఖ తనిఖీలు చేయాల్సిందే. – దారా సుధీర్‌,

వైఎస్సార్‌సీపీ నందికొట్కూరు ఇన్‌చార్జ్‌

నంద్యాల: నకిలీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న టీడీపీ నాయకుల తీరు, కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు మహిళలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ‘నారా వారి నకిలీ మద్యం వద్దు.. ప్రజల ప్రాణాలే ముద్దు’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్‌, బనగానపల్లె, నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలు నిర్వహించారు. నకిలీ మద్యం అమ్మకాలు ఆపి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ జిల్లా కేంద్రం నంద్యాలలో నూనెపల్లె నుంచి ఎకై ్సజ్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి గంట పాటు ఎకై ్సజ్‌ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్‌.. డౌన్‌.. నారా వారి నకిలీ మద్యం వద్దు.., విచ్చలవిడి మద్యం అమ్మకాలను అరికట్టాలి.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎకై ్సజ్‌ సీఐ కృష్ణమూర్తికి వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షు డు దాల్‌మిల్‌ అమీర్‌, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళారెడ్డిలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల బట్టబయలైన నకిలీ మద్యం తయారీ, సరఫరా చూస్తే ప్రజల్లో ఆందోళన కలుగుతుందన్నారు. కేవలం స్పిరిట్‌, రసాయనాలతో తయారు చేసి, పాపులర్‌ బ్రాండ్‌లను తలపించేలా బాటిళ్లపై నకిలీ లేబుల్స్‌ అతికించి యథేచ్ఛగా సరఫరా చేస్తూ అమ్ముతున్నారంటే వారి వెనుక టీడీపీ నాయకులు ఉన్నారని అందరికీ అర్థమవుతుందన్నారు. నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు ఈ కేసును దమ్ముంటే సీబీఐకి కూటమి ప్రభత్వం అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాబున్నిసా, వైఎస్సార్‌సీపీ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి, అనిల్‌ అమృతరాజ్‌, రసూల్‌ ఆజాద్‌, తదితరులు పాల్గొన్నారు.

● ఆళ్లగడ్డలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గంగుల బిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు పట్టణంలోని మహిళా కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ర్యాలీగా ఎకై ్సజ్‌ కార్యాలయానికి చేరుకుని ఎకై ్సజ్‌ అధికారికి వినతి పత్రం అందజేశారు.

● నారావారి నకిలీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బనగానపల్లెలో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు కాటసాని తిరుపాల్‌రెడ్డి ఇంటి వద్ద నుంచి బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఎకై ్సజ్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎకై ్సజ్‌ ఎస్‌ఐ కమలాకర్‌కు వినతి పత్రం అందజేశారు. కల్తీ మద్యంపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ అధికారులతో కాకుండా సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

● ఆత్మకూరు పట్టణంలోని ఎకై ్సజ్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల అధ్యక్షులు రాజమోహన్‌ రెడ్డి, సయ్యద్‌ మీర్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఎక్సైజ్‌ కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి ఎకై ్సజ్‌ ఎస్‌ఐ వీరస్వామికి వినతి పత్రం అందజేశారు.

● నకిలీ మద్యం అమ్మకాలపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు డోన్‌ పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఎకై ్సజ్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పార్టీ వాలంటరీ విభాగం జిల్లా అధ్యక్షుడు పోస్ట్‌ ప్రసాద్‌, జెడ్పీటీసీలు బద్దుల రాజకుమార్‌, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షులు సోమేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, కర్నూలు కార్పొరేషన్‌ మేయర్‌ బీవై రామయ్య ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులో మహిళలు కదం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోట్ల సర్కిల్‌ (పాత కంట్రోల్‌ రూమ్‌) వద్ద నుంచి ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం వరకు పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘నకిలీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వం’ అంటూ భారీ బ్యానర్‌ చేత పట్టి ఎన్‌–బ్రాండ్‌ లిక్కర్‌ను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం ఎదుట దాదాపు రెండు గంటల పాటు బైఠాయించారు. ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వం మద్యం విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎకై ్సజ్‌ కార్యాలయం గేటు వద్ద మద్యాన్ని పారబోసి నిరసన తెలియజేశారు. అనంతరం ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. పల్లెల్లో బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఏఈఎస్‌ను నాయకులు నిలదీశారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, హనుమంత రెడ్డి, కార్పొరేటర్లు చిట్టెమ్మ, అరుణ, లక్ష్మిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నకిలీ మద్యం అమ్మకాలను నిరసిస్తూ నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ దారా సుధీర్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పటేల్‌ సెంటర్‌ నుంచి ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ తీరును అడుగడుగునా ఎండగట్టారు. మద్యం సీసాలు పగులగొట్టి నిరసన వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో

జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

ఎకై ్సజ్‌ కార్యాలయాల ఎదుట

నిరసనలు

తరలి వచ్చిన మహిళలు, ప్రజలు,

పార్టీ శ్రేణులు

నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ

చేయాలని డిమాండ్‌

కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు

కర్నూలులో కదంతొక్కిన మహిళలు 1
1/5

కర్నూలులో కదంతొక్కిన మహిళలు

కర్నూలులో కదంతొక్కిన మహిళలు 2
2/5

కర్నూలులో కదంతొక్కిన మహిళలు

కర్నూలులో కదంతొక్కిన మహిళలు 3
3/5

కర్నూలులో కదంతొక్కిన మహిళలు

కర్నూలులో కదంతొక్కిన మహిళలు 4
4/5

కర్నూలులో కదంతొక్కిన మహిళలు

కర్నూలులో కదంతొక్కిన మహిళలు 5
5/5

కర్నూలులో కదంతొక్కిన మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement