
చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షిద్దాం
నంద్యాల(వ్యవసాయం): చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షిద్దామని డీఈఓ జనార్దన్ రెడ్డి అన్నారు. ఇంటాక్ నంద్యాల చాప్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ సదస్సు స్థానిక గురురాజా పాఠశాలలో సోమవారం ప్రారంభమైంది. ఇంటాక్ సంస్థ నంద్యాల చాప్టర్ అధ్యక్షులు శివకుమార్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన సదస్సులో డీఈఓ మాట్లాడుతూ భారతీయ కళలు సంస్కృతి వారసత్వ సంపద చాలా గొప్పవని, వాటి వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కో కన్వీనర్ సేతురామన్ గురురాజా స్కూల్ డైరెక్టర్ షావలి రెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు.