
శాస్త్రోక్తంగా శేర్తి పూజ
ఆళ్లగడ్డ: నవనారసింహులు కొలువైన ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలంలోని నల్లమల అటవీ ప్రాతంలో కొలువైన శ్రీ మాలోల లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఆదివారం శేర్తి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ఉద యం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపారు. నిత్య పూజలు అనంతరం గద్య త్రయం విన్నవించారు. అనంతరం నిత్యం ఆరాధించే ఉత్సవమూర్తి స్వర్ణ మాలోల నరసింహస్వామిని మూలమూర్తితో ఉంచి ప్రత్యేక శేర్తి పూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధించారు. అనంతరం శాత్తుమురై గోష్టి కార్యక్రమాలతో పూజలు ముగించారు. ఈ పూజలు ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

శాస్త్రోక్తంగా శేర్తి పూజ