
విక్రయాలను అడ్డుకోవాలి
గంజాయి, డ్రగ్స్ రవాణా, విక్రయాలను అధికారులు అడ్డుకోవాలి. నంద్యాలలో ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ, బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్‌లో చదువుకోడానికి పలు జిల్లాల నుంచి యువత వస్తోంది. యువకులనే కేంద్రంగా చేసుకొని గంజాయి వ్యాపారులు గంజాయిని పట్టణంలో అమ్ముతున్నారు. పోలీసులు విస్తృత దాడులు చేసి ముఠా ఆట కట్టించాలి
– రాజునాయుడు,
ఆర్‌వీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, నంద్యాల
పోలీసు, ఎకై ్సజ్ శాఖ అధికారులు మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. తూతూ మంత్రంగా కాకుండా ప్రధాన కూడళ్లు, కళాశాలలు, పాఠశాలల వద్ద అవగాహన కలిగేలా ప్లెక్సీలు ఏర్పాటు చేయాలి. పోలీసులు కాలేజీలు, గ్రామ శివారులు, నిర్మానుష్య ప్రాంతాలో నిఘా ఉంచాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపైనే నిఘా ఉంచి పక్కదారి పట్టకుండా బాధ్యతగా ఉండాలి. మత్తు పదార్థాలపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు కల్పించాలి.
– నాగరాముడు,
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి, నంద్యాల

విక్రయాలను అడ్డుకోవాలి