
ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లోనూ ఖరీదైన ఇంజెక్షన్లు
ఇటీవల కాలంలో చిన్న వయస్సు నుంచే దురలవాట్లు ఎక్కువయ్యాయి. దీనికితోడు మితిమీరిన ఆహారపు అలవాట్లు, సమయానికి తినకపోవడం, మద్యపానం, దూమపానంతో స్థూలకాయ బాధితులు ఎక్కువయ్యారు. దీనివల్లే గుండైపె ఒత్తిడి అధికమవుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ గుండెపోటుతో మరణించేవారి సంఖ్య ఎక్కువైంది. ఇలాంటి వారు పెరగడంతో 2023లో స్టెమీ ప్రోగ్రామ్ ప్రారంభించి ఖరీదైన టెనిక్టమిప్లేజ్ అనే ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వీటిని రోగులకు ఉచితంగా అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఈ ఇంజెక్షన్ ఎంతో ఉపయోగపడుతోంది. వారి ప్రాణాలు పోకుండా కాపాడుతోంది.
–డాక్టర్ జఫ్రుల్లా, డీసీహెచ్‌ఎస్, కర్నూలు
ఆసుపత్రిలోని క్యాజువాలిటీ విభాగానికి ప్రతిరోజూ ఐదారుగురు గుండెపోటుతో చికిత్స కోసం వస్తుంటారు. వీరికి 2023లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన స్టెమీ ప్రోగ్రామ్ కింద దాదాపు రూ.40వేల ఖరీదైన టెనెక్టిప్లేజ్ ఇంజెక్షన్లు ఉచితంగా ఇస్తున్నాం. రెండు గంటల అబ్జర్వేషన్ తర్వాత కార్డియాలజీ విభాగానికి పంపిస్తున్నాం. గుండెపోటు వచ్చిన వెంటనే రెండు గంటలలోపు ఆసుపత్రికి రోగిని తీసుకువస్తేనే ఈ ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. ఇటీవల కాలంలో ఎక్కువ శాతం 30 నుంచి 40 ఏళ్లలోపు వారే గుండెపోటుతో వస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వస్తే ప్రాణాలు నిలిచే అవకాశం ఉంది.
– డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ మెడిసిన్, జీజీహెచ్, కర్నూలు