
ఆస్తి లాక్కునేందుకు ఇంటి నుంచి గెంటేశారు
● ఎస్పీని ఆశ్రయించిన మహిళ
నంద్యాల: 15 నెల క్రితం తన భర్త చనిపోయాడని, ఆయన పేరుపై ఉన్న ఆస్తిని తన మరిది, అత్త, ఆడపడుచు లాక్కునేందుకు తనను ఇంటి నుంచి గెంటేశారని పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన కవితి జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌కు ఫిర్యాదు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోని, తన భర్త ఆస్తి తనకు దక్కేలా న్యాయం చేయాలని కోరారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు వంటి 105 సమస్యలు వచ్చాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు.