
బడి పక్కనే మందు దుకాణం
పగిడ్యాల: గత ప్రభుత్వంలో మద్యం షాపులు ఎక్కడో ఉండేవి. ఈ ప్రభుత్వంలో గుడి,బడి అనే తేడా లేదు. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు కనిపిస్తున్నాయి. కిరాణం, కూల్‌డ్రింక్‌షాపుల్లో కూడా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఆదాయం కోసం సామాజిక బాధ్యతను కూటమి సర్కారు విస్మరించడంతో ఊరూరా మద్యం ఏరులై పారుతోంది. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని పగిడ్యాల మండలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు ఏకంగా ఆలయాలు, పాఠశాలల వద్దే మద్యం అమ్ముతున్నారు. దాడులు చేయాల్సిన ఎకై ్సజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిండటంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.

బడి పక్కనే మందు దుకాణం

బడి పక్కనే మందు దుకాణం