
సెట్‌ల కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ విడుదల
నంద్యాల: కుటుంబ కలహాలతో భార్యను భర్తే గొంతు కోసి చంపాడు. ఈ దారుణ ఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్‌బాషా తెలిపిన మేరకు వివరాలు.. సాయినాథ్‌శర్మ, శిరీష దంపతులు పట్టణంలోని ఎన్‌జీఓస్ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు గత కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కూతురు శ్రీహిత స్థానికంగా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే, భార్య శిరీష (45) బయట అప్పులు చేయడం..ఈ కారణంతో రుణదాతలు తరచుగా ఇంటికి వస్తున్నారు. దీంతో ఆగ్రహించిన సాయినాథ్‌శర్మ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశారు. ఈమేరకు కుమార్తె శ్రీహిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.