ఖాళీ కడుపుతో చదువుకునేదెట్టా! | - | Sakshi
Sakshi News home page

ఖాళీ కడుపుతో చదువుకునేదెట్టా!

Sep 7 2025 12:28 PM | Updated on Sep 7 2025 12:28 PM

ఖాళీ కడుపుతో చదువుకునేదెట్టా!

ఖాళీ కడుపుతో చదువుకునేదెట్టా!

పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి

మధ్యాహ్న భోజన ఏజెన్సీనైనా

మార్చండి.. టీసీలైనా ఇవ్వండి

కొమ్మూరు కొట్టాల పాఠశాల

విద్యార్థుల తల్లిదండ్రుల మొర

బేతంచెర్ల: మధ్యాహ్న భోజనం అరకొరగా పెడుతున్న బడిలో తమ పిల్లలు చదువుకోలేరని, టీసీలు ఇస్తే ఏదైనా బడిలో చేర్పిస్తామని కొమ్మూరు కొట్టాల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మొర పెట్టుకుంటున్నారు. ఏజెన్సీని మార్చాలని మొరపెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ శనివారం వారు ఎంఈఓ సోమశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. భోజన ఏజెన్సీకి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు సూచించిన వారిని కాకుండా అధికార పార్టీ నాయకులు తమకు నచ్చిన వారిని ఎక్కించుకొని రాజకీయం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించకుండా గతంలో ఉన్న నాగలక్ష్మమ్మను తొలగించి ఆమె స్థానంలో కొమ్ము మహాలక్ష్మికి ఏజెన్సీని కట్టబెట్టారన్నారు. ఆ ఏజెన్సీ వాళ్లు విద్యార్థులకు సరిగా అన్నం పెట్టకపోవడంతో అర్ధాకలితో చదువుకోలేక ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఐదుగురు మాత్రమే బడికెళ్తున్నారు. దాదాపు రెండు నెలలుగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లకున్నా పట్టించుకునేవారు లేరు. జిల్లా కలెక్టర్‌, డీఈఓకు ఫిర్యాదు చేసినప్పటికీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో సమస్య పరిష్కారం కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజనం నిర్వహణపై ఓ వర్గం పెత్తనం చెలాయిస్తోందని, అయితే ఆ వర్గం పిల్లలను మాత్రం ఈ బడికి పంపడం లేదనే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారి మాట వినకపోతే కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయంపై ఎంఈఓ సోమశేఖర్‌ను వివరణ కోరగా అందరూ కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే.. టీసీల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు.

మధ్యాహ్న భోజనం అరకొరగా పెడుతున్నారని పిల్లలు ఇంటికి వచ్చి చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం చూడటానికి తల్లిదండ్రులను పాఠశాల వద్దకు రానీయడం లేదు. మేము వెళ్లి చూడాలంటే పోలీసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మా పిల్లలను ఏవిధంగా స్కూలుకు పంపించాలి. 30 మంది పిల్లలకు టీసీలు ఇస్తే వేరే పాఠశాలలో చేర్పించుకుంటాం. – మద్దిలేటి

మా పిల్లలకు మధ్యాహ్న భోజనం సక్రమంగా పెట్టడం లేదని ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనికి తోడు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. మెజార్టీగా ఉన్న తల్లిదండ్రుల విన్నపాన్ని పట్టించుకోవడం లేదు. మా పిల్లలు సక్రమంగా పాఠశాలకు వెళ్లడం లేదు. జిల్లా అధికారులు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలి.

– మదన గోపాలు, విద్యార్థి తండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement