
రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి ● మరో ముగ్గురికి గాయాలు
శిరివెళ్ల: ఆళ్లగడ్డ– నంద్యాల జాతీయ రహదారిపై గోవిందపల్లె– కాండ్ల పల్లె మధ్య కార్తికేయ గోడౌన్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐచర్ వాహన క్లీనర్ మృతి చెందాడు. ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో సడన్‌గా నిలపడంతో అదే సమయంలో వెనుక వస్తున్న ఐచర్ వాహనం వేగంగా వచ్చి ఢీ కొనింది. ఈ ప్రమాదంలో ఐచర్ వాహనంలో ఉన్న క్లీనర్ మహానంది మండలం బొల్లారానికి చెందిన కురువ కుమార్ పీటర్ (42)తీవ్రంగా గాయపడి ఇరుక్కపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన బాలాంజనేయులు, రాజోలి మల్లి, మహమ్మద్ బాషాలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తంగా నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇరువురు సంతానం ఉన్నారు. మృతుని భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చిన్న పీరయ్య కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నారు.