
హెలిటూరిజం మళ్లీ వచ్చేనా..
శ్రీశైల మహాక్షేత్ర ఖ్యాతి విశ్వవ్యాప్తంగా విస్తరించడంతో వివిధ దేశాల నుంచి భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి భక్తుల సౌకర్యార్థం దేవస్థానం, ఏవియేషన్ సంయుక్తంగా హెలి టూరిజం ఏర్పాటు చేసింది. 2016, ఆగస్టు 28న హెలి టూరిజంను అప్పటి దేవస్థాన ఈఓ నారాయణ భరత్‌గుప్తా ప్రారంభించారు. సమ్మిట్ ఏవియేషన్ సంస్థ ద్వారా హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సర్వీసును నడిపింది. అలాగే లోకల్‌గా భక్తులు, స్థానికుల సౌకర్యార్థం జాయ్ ట్రిప్‌ను సైతం ఏర్పాటు చేసింది. హెలి టూరిజానికి భక్తుల నుంచి ఆదరణ ఉన్నప్పటికీ అర్దాంతరంగా నిలిపివేశారు.
యాత్రికులతో శ్రీశైలం చేరుకున్న హెలికాప్టర్ (ఫైల్)