
శ్రీశైల దేవస్థానం భద్రతపై ప్రత్యేక దృష్టి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆ దేవస్థాన నూతన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్నారు. దేవస్థాన సీఎస్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం దేవస్థానంలోని భయ దేవాలయాల్లో క్యూలైన్లను, కంపార్ట్‌మెంట్లను పరిశీలించారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. అక్కడ సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. అలాగే టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది రోల్‌కాల్‌ను పరిశీలించి భక్తులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. అనంతరం మీడియాతో సీఎస్‌ఓ మాట్లాడుతూ అందరి సహకారంతో క్షేత్ర భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్ అధికారి హోదాలో పనిచేసి పదవీ విరమణ చేసినట్లు తెలిపారు.