
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ‘రాజ’బాట
డోన్: అత్యున్నత విద్యను బోధిస్తూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి వచ్చింది. డోన్ కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి అప్పటి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సహకారంతో డోన్‌కు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించారు.
ఐటీఐ విద్యార్థుల
వసతి గృహం కేంద్రంగా..
కేంద్రీయ విద్యాలయాన్ని డోన్‌లో రెండేళ్ల క్రితమే ప్రారంభించాలనుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఐటీఐలో రూ.3కోట్లతో నిర్మించిన విద్యార్థుల వసతిగృహాన్ని విద్యాలయం నిర్వహణకు ఎంపిక చేశారు. బాత్రూం, సైన్స్‌ల్యాబ్, గ్రంథాలయం, వెంటిలేటర్స్, కిచెన్, హాస్టల్ వసతి తదితర ఫీజుబులిటీ సర్టిఫికెట్లను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఇప్పించారు. ఈ విద్యాలయాన్ని ప్రారంభించకుండా టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి విఫలయత్నం చేశారు.
అడ్మిషన్లు ప్రారంభం
కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయివరకు చదవొచ్చు. ప్రస్తుత ఏడాదికి కేవలం ఒకటి నుంచి ఐదో తరగతి వరకే నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఐటీఐలో 2025–26 విద్యా సంవత్సరానికి గానూ దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు తమ దరఖాస్తు ఫారాలను స్థానిక కార్యాలయంలో అందజేసే అవకాశాన్ని కల్పించారు. సెప్టెంబర్ 11వ తేదీన లాటరీ పద్ధతిలో డ్రా తీసి 12వ తేదీన తుది జాబితా ప్రకటిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు ప్రవేశాలు కల్పిస్తారు.
గత ప్రభుత్వ హయాంలో నంద్యాల జిల్లాలోనే డోన్ విద్యారంగంలో అగ్రస్థానం పొందింది. వెటర్నటీ పాలిటెక్నిక్, గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం, పాలిటెక్నిక్, ప్రభుత్వ ఐటీఐ, ఎస్సీ, బీసీ బాల, బాలికల గురుకుల పాఠశాల, ఉర్దూ పాఠశాలలను మంజూరు చేయించడమే కాక అత్యాధునిక వసతులతో భవనాలు నిర్మించడం చరిత్రలో నిలిచిపోతోంది. కేంద్రీ య విద్యాలయం ఏర్పాటుతో విద్యారంగంలో డోన్ అగ్రభాగాన నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. – మాణిక్యం శెట్టి, ఉపాధ్యాయ సంఘం నేత
డోన్ కేంద్రీయ విద్యాలయంలో
ప్రవేశాలు ప్రారంభం
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
ప్రత్యేక చొరవ
నంద్యాల జిల్లా విద్యార్థులకు
ఎంతో మేలు

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ‘రాజ’బాట

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ‘రాజ’బాట

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ‘రాజ’బాట