శ్రీశైలంలో మద్యం సీసాలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో మద్యం సీసాలు స్వాధీనం

Aug 30 2025 7:17 AM | Updated on Aug 30 2025 7:17 AM

శ్రీశైలంలో మద్యం సీసాలు స్వాధీనం

శ్రీశైలంలో మద్యం సీసాలు స్వాధీనం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైలం టోల్‌గేట్‌ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఓ వ్యక్తి వద్ద నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీశైలం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.ప్రసాదరావు తన సిబ్బందితో కలిసి టోల్‌గేట్‌ వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో శ్రీశైలం వడ్డెర కాలనీకి చెందిన దండుగల మల్లికార్జున 32 మద్యం బాటిళ్లు తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్నారు. అతని వద్ద మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసులు రాజేంద్రకుమార్‌, రఘునాథుడు, బాలకృష్ణ, అమర్నాథరెడ్డి, వెంకటనారాయణ, నానునాయక్‌, లాల్‌సా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement