
విరిగిపడిన కొండచరియలు
శ్రీశైలం ప్రాజెక్ట్: కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో గురువారం డ్యాంకు సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపైనే కొండ చరియలు పడినా ఆ సమయంలో ఎలాంటి రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇదిలాఉంటే గత కొద్ది వారాలుగా శ్రీశైలండ్యాం గేట్లు తెరచి నీటిని విడుదల చేస్తుండడంతో నీటి తాకిడికి డ్యాం పరిసర ప్రాంతాల్లోని కొండచరియలు బలహీన పడటం ఆందోళన కలిగిస్తోంది.
అహొబిలంలో .....
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. దేవాలయం వెళ్లే మెట్లమార్గంలో కొండపై నుంచి భారీ బండరాయి విరిగి కిందపడింది. ఈ ప్రమాదంలో పెద్ద చెట్టు, కరెంట్ స్తంభం నేలమట్టమయ్యాయి. విద్యుత్ తీగలు తెగి దారికి అడ్డంగా పడ్డాయి. తెల్లవారు జామున భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

విరిగిపడిన కొండచరియలు