
హామీల అమలులో ‘కూటమి’ విఫలం
● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి
కల్లూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. పుసులూరు గ్రామంలో గురువారం సాయంత్రం బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ, ఇంటింటికి వంచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ క్యూఆర్ కోడ్ ద్వారా గత ఏడాది కాలంలో ప్రతి కుటుంబం ఎంత నష్టపోయారో వివరించారు. కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని, మహిళలకు ఉచిత బస్సు అమలు కావడం లేదని ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, సోమన్న, పార్టీలో వివిధ విభాగాల్లో పదవులు పొందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.