
పల్లె రోడ్లు పట్టని ప్రభుత్వం
● గత వైఎస్సార్‌సీపీ పాలనలో
కూటమి నేతల గగ్గోలు
● అప్పట్లో రూ.182.83 కోట్ల
నాబార్డు నిధులు
● ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు
రూ.42.13 కోట్లు
● ఒక్కో నియోజకవర్గానికి
రూ.5కోట్ల పనులకు ప్రతిపాదన
● రూ.3కోట్ల పనులకే మంజూరు
● ఆళ్లగడ్డ, డోన్ నియోజకవర్గాలపై
వివక్ష
నాలుగు
నెలలకే ఛిద్రం
పీఎంజీఎస్‌వై కింద రూ.480.50 లక్షల అంచనాతో కర్నూలు మండలం పసుపుల నుంచి గార్గేయపురం వరకు తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం 2024 మార్చి 6న ప్రారంభించి ఈ ఏడాది మార్చి 5న పూర్తి చేశారు. ఈ రోడ్డును ఐదు సంవత్సరాలు నిర్వహించేందుకు రూ.31.21 లక్షలుగా పేర్కొన్నారు. అయితే రోడ్డును ప్రారంభించిన నాలుగు నెలలకే పలు చోట్ల ఛిద్రమైంది.