
94 పరిశ్రమలకు అనుమతులు
నంద్యాల: వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోసం గత మూడు నెలల కాలంలో 116 దరఖాస్తులు వచ్చాయని డీఆర్‌ఓ రామునాయక్ తెలిపారు. సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 94 పరిశ్రమలకు అనుమతులు మంజూరు అయ్యాయని చెప్పారు. ఇంకా 22 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ.. ఉత్పాదన, సేవా రంగాల్లోని 25 యూనిట్లకు మొత్తం 96.08 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాలను మంజూరు చేశామన్నారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‘ (ఒక జిల్లా ఒక ఉత్పత్తి)లో భాగంగా జిల్లాలో ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న వాటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చేపడుతున్న సర్వేను పూర్తి చేయాలన్నారు. పరిశ్రమల శాఖ జీఎం ఎస్.మహబూబ్‌బాషా, పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, ఎల్‌డీఎం రవీందర్ కుమార్, పొల్యూషన్ కంట్రో ల్ బోర్డు ఈఈ కిశోర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కా మర్స్ అధ్యక్షుడు రాజమహేంద్రనాథ్ పాల్గొన్నారు.
డీఆర్‌ఓ రామునాయక్