
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
నందికొట్కూరు: మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువకు నీటిని గురువారం సీఎం చంద్రబాబు నాయుడు విడు దల చేయనున్నారని, జలహారతి ఇవ్వనున్నా రని, అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా తెలిపారు. అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ స్థలాన్ని బుధవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. నీటి పంపింగ్ స్టేషన్, జలహారతి ఇచ్చే ప్రదేశం, సభాస్థలితో పాటు ఇతర ప్రాంతాలను వారు పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.