
● నారుమడికి రక్షణ ‘వల’యం
కేసీ కెనాల్‌కు సాగు నీరు విడుదల కావడంతో మండలంలోని రైతులు వరినాట్లు వేసుకొనే పనుల్లో నిమగ్నమయ్యారు. వరి నాటుకు ముందుగా రైతులు నారుమళ్లను పొలంలో సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. నారుమడిని 25 రోజులపాటు కంటికి రెప్పలా కాపాడుకుంటేనే వరి పంటకు నాటు వేసేందుకు అవకాశం ఉటుంది. మండల పరిధిలోని నిడ్జూరు, జి.సింగవరం, ఆర్. కొంతలపాడు, సుంకేసుల, పడిదెంపాడు, ఆర్.కె.దుద్యాల, ఎదురూరు, తులశాపురం గ్రామాల్లో రైతులు అధికంగా వరి పంటను సాగు చేస్తారు. ఈ క్రమంలో జి.సింగవరంలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించి వరి నారుమడిని పక్షులు, జంతువులు నాశనం చేయకుండా చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశాడు. నారుమడి చుట్టూ కర్రలు పాతి 5 అడుగుల ఎత్తులో వల ఎర్పాటు చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. – కర్నూలు(రూరల్)