ఉన్నతాధికారులకు
నివేదిక పంపాం
బ్రిడ్జి గోడలు సగానికి పైగా కూలిపోయిన మాట వాస్తవమే. మరమ్మతుల కోసం ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక పంపాం. అక్కడి నుంచి అనుమతులు రాగానే మరమ్మ తు పనులు చేపడతాం. అంతవరకు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి భారీ వాహనాలు తిరగకుండా చర్యలు చేపడతాం.
– అల్లాబకాష్, ఎంపీడీఓ
చిప్పగిరి: మండలంలోని ఆరు గ్రామాలతో పాటు హాలహర్వి మండలంలోని నాలుగు గ్రామాలకు ఏకై క మార్గమైన ఆ ప్రధాన రహదారిలో ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరి సంగం కూలి అత్యంత ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. మండల కేంద్రం చిప్పగిరి నుంచి ఏరూరు,డేగులహాలు,బంటణాహాలు,గుమ్మనూరు,కాజీపురం,కొట్టాల,గ్రామాలతో పాటు హాలహర్వి మండలంలోని చింతకుంట,సిరిగాపురం,కొక్కర చేడు,మల్లికార్జున పల్లి గ్రామాలకు వెళ్లాలంటే చిప్పగిరి సమీపంలో ఉన్న ఏబీసీ కెనాల్ దాటడానికి వంతెన నిర్మించారు. అయితే ఇది శిథిలావస్థకు చేరింది. కింద భాగంలో సగానికి పైగా గోడలు కూలిపోయాయి. ఆయా గ్రామాలకు వెళ్లే వారితో ఈ దారి నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ఎప్పుడు కూలుతుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు నీటిని విడుదల చేస్తే కూలిపోయే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు.
క్షణ క్షణం.. భయం భయం
క్షణ క్షణం.. భయం భయం