
ఏపీఎల్‌కు ఆలూరుకు కుర్రాడు
ఆలూరు రూరల్: ఆంధ్రా ప్రీమియర్ క్రికెట్ లీగ్ (ఏపీఎల్)కు ఆలూరుకు కుర్రాడు కమరుద్దీన్ ఎంపికయ్యాడు. సోమవారం వైజాగ్‌లో నిర్వహించిన ఏపీఎల్ వేలాల్లో కాకినాడ కింగ్స్ టీం కమరుద్దీన్‌ను రూ.5.20 లక్షలకు కొనుగోలు చేసింది. 2023 ఏడాది సెప్టంబర్ నెలలో విశాఖపట్నంలో జరిగిన ఏపీల్‌లో టోర్ని ఫైనల్‌లో 13 వికేట్లు తీసి..185 బంతుల్లో 38 పరుగులు చేసి ఆల్‌రౌండర్ ప్రతిభ చాటి పర్పూల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. క్రికెట్‌పై ఆసక్తితో 13 ఏళ్ల నుంచే శ్రమించాడు. 20 ఏళ్ల వయసులో ఆంధ్ర, సౌత్‌జోన్ జట్టులో చోటు సంపాదించాడు. అప్పట్లోనే ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కుటుంబ సభ్యుల సహకారంతో మరో సారి ఏపీఎల్‌కు ఎన్నికయ్యానని, దేశం కోసం ఆడాదలన్నదే తన ఆశయమని కమరుద్దీన్ తెలిపారు.
‘బీమా’కు నేడు తుది గడువు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పత్తి,వేరుశనగకు వాతావరణ ఆధారిత పంటల బీమా కోసం ప్రీమియం చెల్లింపు గడువు ఈ నెల 15వ తేదీ తో ముగియనుంది. బీమా చేసుకోవడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉంది. పత్తికి హెక్టారు కు రూ.లక్ష విలువకు బీమా చేస్తారు. ప్రీమియం హెక్టారుకు రూ.5వేలు చెల్లించాల్సి ఉంది. వేరుశనగ హెక్టారుకు రూ.70 వేల విలువకు బీమా చేస్తారు. రైతులు ప్రీమియం రూ.1400 చెల్లించాల్సి ఉంది.