
మెట్టకు ప్రాణం పోసిన అపర భగీరథుడు
ఆత్మకూరు: వర్షాధార పంటలు పండే మెట్ట భూములకు మహానేత వైఎస్సార్ ప్రాణం పోసి అపరభగీరథుడుగా మారారు. ఆత్మకూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఒకే సారి ఐదు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి మెట్ట భూములను ఆయకట్టుగా మార్చారు. జలయజ్ఞంలో భాగంగా సిద్దాపురం, చెలిమెళ్ల, లింగాల, శివపురం, ఇస్కాల ఎత్తిపోతల పథకాలతో దాదాపు 30 వేల ఎకరాలకు పైగా నీరందించారు. 2006లో ఈ పథకాలకు నిధులు మంజూరు చేయడంతో పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రైతులు రెండు పంటలు పండిస్తూ నేటికీ మహానేత మేలును తలుచుకుంటున్నారు.