
నందుల కోటతో అభివృద్ధి అనుబంధం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నంద్యాలతో ఎనలేని అనుబంధం ఉంది. నంద్యాల నియోజకవర్గానికి దాదాపు రూ. 250 కోట్లకుపైగా నిధులను అందజేశారు. రూ. 4.24 కోట్లతో నందమూరి నగర్, వైఎస్ నగర్‌లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు వేశారు. 2007 జూన్ 21న పట్టణం వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో వైఎస్సార్ పర్యటించి శ్యామకాలువ, కుందూ నది, మద్దిలేరులను విస్తర్ణకు రూ. 92 కోట్లను మంజూరు చేశారు. అలాగే అప్పటి మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి నందమూరి నగర్ పక్కన వైఎస్ నగర్ పేరుతో మోడల్ కాలనీ ఏర్పాటు చేశారు.