
పరిహారం అందించాలి
ముందస్తు వర్షాలు కురవడంతో జూన్ మొదటి వారంలోనే మూడు ఎకరాల్లో మొక్కజొన్న విత్తనం వేశాను. ఎకరాకు రూ. 15 వేల మేర పెట్టుబడి పెట్టా ను. దాదాపు నెల రోజులుగా పెద్దగా వానల్లేవు. ఇప్పుడు వర్షాలు కురిసినా ఫలితం ఉండదు. దిగుబడి రాక నష్టపోవాల్సిందే. కష్టమంతా వృథా అవుతుంది. అందుకే పంటను తొలగించాను. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి. – లింగస్వామి పెద్దగుమ్మాడాపురం రైతు,
కొత్తపల్లి మండలం
నష్టాలు తప్పవు
మొక్కజొన్న పంటను ఐదు ఎకరాల్లో సాగు చేశాను. ఇప్పటికే రెండు సార్లు మందులు వేశాను. పంటలో కలుపు కూలీలతో తీయించాను. మొక్కజొన్న పంట ఎదిగే సమయంలో వానదేవుడు ముఖం చాటేశాడు. వర్షాలు పడితేనే కాని పంటలు పండని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కూడా నష్టాలు తప్పవు. మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – శెట్టి భాస్కర్ రైతు దామగట్ల గ్రామం,
నందికొట్కూరు మండలం

పరిహారం అందించాలి