
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో చోటు
నంద్యాల: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన పలువురికి చోటు లభించింది. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ బీసీసెల్ ప్రధాన కార్యదర్శిగా బి.శివశంకర్‌నాయుడు, కార్యదర్శిగా సి.లాలుస్వామి, జాయింట్ సెక్రటరీలుగా ఎం.బాలస్వామి, కె.పుల్లయ్యయాదవ్, ఎం.మునీర్‌బాషా, రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా నసురుల్లాఖాన్‌లను నియమించారు.
మంత్రాలయం తుంగా తీరంలో షవర్లు
మంత్రాలయం: తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల నదీ ప్రవాహంలో కర్ణాటక రాష్ట్రం అర్షికేరి మండలానిక చెందిన ముగ్గురు యువకులు గల్లంతై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీమఠం, ప్రభుత్వాధికారులు మేల్కొన్నారు. ప్రమాద ఘంటికలు పొంచి ఉండటంతో భక్తుల నదీ స్నానాలకు బ్రేకులు వేశారు. నదిలోకి ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదు. స్నానపు ఘాట్‌తో రెండు విభాగాలుగా షవర్లను ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా స్నానాలు ఆచరించేలా షవర్ల సముదాయాన్ని నెలకొల్పారు. ప్రత్యేక విద్యుత్ మోటార్ల ద్వారా షవర్లకు నీటిని సరఫరా చేస్తున్నారు. తీరం పొడవునా పోలీసులు, సెక్యురిటీ గార్డ్స్‌ను పహారాగా పెట్టారు. నదిలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు శ్రీమఠం మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో చోటు