
సమస్యల ‘తొలిఅడుగు’
కొత్తపల్లి: తొలిఅడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా గువ్వలకుంట్ల, జి.వీరాపురం గ్రామాలకు వెళ్లిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యకు సమస్యలు ఎదురయ్యాయి. పక్కా గృహాల్లేక కొట్టాల్లోనే నివాసం ఉంటున్నామని, దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయడం లేదని పలు సమస్యలను ప్రజలు చెప్పారు. గువ్వలకుంట్ల ఎస్సీకాలనీలో రోడ్డు వెంట వర్షం నీరు నిలుస్తోందని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పాలెంచెరువు గూడెంకు వెళ్లేందుకు రోడ్డు అధ్వానంగా ఉందని చూపించారు. బ్రహ్మంగారి నగర్‌లో విద్యుత్ స్తంభాలులేక ఇబ్బందులు పడుతున్నామని, జి.వీరాపురం గ్రామంలో ఎస్సీకాలనీ మొత్తం రోడ్లవెంట వర్షం నీరు నిలుస్తోందని.. సమస్యలను పరిష్కరించాలని కోరారు.
నందికొట్కూరు ఎమ్మెల్యేకు
ప్రజల నుంచి సమస్యల వెల్లువ