
ఒకే గదిలో మూడు తరగతులు
సంజామల: బెంచ్‌లు లేవు.. పాఠ్యపుస్తకాలు రాలేదు.. బ్యాగులు కూడా ఇవ్వలేదు.. పాత యూనిఫాంలు ధరించి కొందరు.. సాధారణ దుస్తులతో మరికొందరు.. ఒకే గదిలో ఇరుకు స్థలంలో కూర్చోవాల్సి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు మూడు తరగతుల విద్యార్థులకు ఒకే టీచర్ పాఠాలు చెప్పాల్సి ఉంది. సంజామల మండలం ఆకుమల్ల మోడల్ స్కూల్‌లో దుస్థితి ఇది. ఇక్కడ ఒకలో తరగతిలో12, రెండవ తరగతిలో 19, మూడో తరగతిలో 23, నాలుగవ తరగతిలో 24, ఐదో తదరగతిలో 21 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒక ఉపాధ్యాయురాలు ఒకటో, రెండవ, మూడవ తరగతి విద్యార్థులకు బోధిస్తుంటే మరో ఉపాధ్యాయురాలు నాలుగు, ఐదు తరగతులను బోధిస్తున్నారు. బుధవారం ఒకే గదిలో 1,2,3 తరగతులకు చెందిన విద్యార్థులు 44 మంది విద్యార్థులకు టీచర్ బోధించాల్సి వచ్చింది.