
అఖండ సౌభాగ్యం.. వారాహి అమ్మవారి దర్శనం
కర్నూలు కల్చరల్: ఓల్డ్‌సిటీలోని లలితా పీఠంలో నిర్వహిస్తున్న వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సోమవారం పురస్కరించుకొని వారాహి అమ్మవారికి అభిషేకం చేశారు. ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం కలగాలని పసుపు కొమ్ములతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి దర్శనం కల్పించారు. సామూహిక కుంకుమార్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లలితా పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులను ఉద్ధేశించి మాట్లాడారు. లలితా పీఠం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.