
ఆనందంతో గ్రామస్తులు సన్మానం చేశారు
తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్‌కు చెందిన శ్రీనివాసులు (65) గత మార్చిలో గుండె సమస్యతో మా వద్దకు వచ్చారు. అతనికి పరీక్షలు నిర్వహించగా గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన నాళం 70 శాతం మూసుకుపోయిందని గుర్తించాం. ఎల్‌ఎన్‌సీఏ నుంచి ఎల్‌ఏడీకి స్టంట్ వేయడం కష్టంతో కూడుకున్న పని. దీంతో వెంటనే రోగిని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని, ఇలాంటి ఆపరేషన్లు అక్కడు చేస్తారని సూచించాం. కానీ మాపై ఉన్న నమ్మకంతో ఇక్కడే చికిత్స చేయాలని కుటుంబసభ్యులు కోరారు. రిస్క్ తీసుకుని అతనికి స్టంట్ వేశాం. అన్ని జాగ్రత్తలతో చికిత్స అందించడంతో ఆయన పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అలంపూర్ గ్రామస్తులు పెద్దఎత్తున వచ్చి నన్ను ఘనంగా సన్మానించి పొగిడారు. భావోద్వేగంతో ఆనందబాష్పాలు వచ్చాయి. –డాక్టర్ ఎన్.చైతన్యకుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, కర్నూలు