
ఆ మానసిక రోగి నేడు అమెరికాలో ఐటీ ఉద్యోగి
నేను కర్నూలులో 1992 నుంచి మానసిక రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాను. 25 ఏళ్ల క్రితం ఓ డాక్టర్ ఇంటర్ పూర్తయిన తన కుమారుడిని డిప్రెషన్, ప్రవర్తనా రాహిత్య రుగ్మతలతో నన్ను సంప్రదించారు. ఆ అబ్బాయికి నేనిచ్చిన ఔషధాలు, కౌన్సెలింగ్ వల్ల మానసిక రుగ్మతల నుంచి బయటపడి ప్రస్తుతం అమెరికాలో ఐటీ ఉద్యోగిగా స్థిరపడి సంతోషంగా జీవిస్తున్నాడు. అలాగే ఒక బ్రాహ్మణ వేద పండిత విద్యార్థి మంత్రోచ్ఛారణ సరిగ్గా చేయలేకపోతున్నానని, తీవ్రమైన డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య ఆలోచనలతో నన్ను సంప్రదించాడు. అతనికి అందించిన చికిత్స వల్ల ప్రస్తుతం కర్నూలులో ప్రముఖ బ్రాహ్మణోత్తముడిగా సేవలందిస్తున్నారు.
– డాక్టర్ బి.రమేష్‌బాబు, మానసిక వ్యాధుల వైద్యనిపుణులు, కర్నూలు