
జీఓ నం.4 దివ్యాంగ క్రీడాకారులకు వరం
● న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల(న్యూటౌన్): జీఓ నం.4 దివ్యాంగ క్రీడాకారులకు వరమని న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫ రూక్ అన్నారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, కార్యదర్శి రామస్వామి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన పారా స్పోర్ట్స్ చైతన్య రథయాత్ర శనివారం నంద్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం క్రీడా కోటలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పించిందన్నారు.అనంతరం జాతీయ స్థాయి పథకం సాధించిన దివ్యాంగ క్రీడాకారుడు వెంకట్‌ను అసోసియేషన్ నాయకులతోపాటు మంత్రి ఫరూక్ అభినందించారు. పారా స్పోర్ట్స్ జిల్లా అధ్యక్షుడు రవికృష్ణ, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు పీవీ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.