వలంటీర్‌ వ్యవస్థను కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

వలంటీర్‌ వ్యవస్థను కొనసాగించాలి

May 31 2025 1:12 AM | Updated on May 31 2025 1:12 AM

  వలం

వలంటీర్‌ వ్యవస్థను కొనసాగించాలి

ఐదేళ్లపాటు వలంటీర్‌గా పనిచేసి తనకు కేటాయించిన 70 కుటుంబాలకు విశిష్ట సేవలందించాను. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామునే లబ్ధిదారులకు ఫించన్లు అందజేశాను. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి నవరత్న పథకాల వర్తింపులో తమ వంతు కృషి చేశాను. కూటమి ప్రభుత్వం వలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.

– కౌసర్‌, వలంటీర్‌, సౌదరదిన్నె,

కోవెలకుంట్ల మండలం

ఇప్పుడు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది

వలంటీర్‌ వ్యవస్థ ద్వారా గతంలో ఇంటి వద్దకే అన్ని రకాల సేవలందేవి. సంక్షేమ పథకాలు, వివిధ ధృవపత్రాలను వలంటీర్లు ఇళ్ల వద్దకే తీసుకొచ్చి ఇచ్చేవారు. ఏడాది నుంచి వలంటీర్‌ వ్యవస్థ లేకపోవడంతో సేవలు అందటం లేదు. ప్రభుత్వం నుంచి ఏ చిన్నపని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇందుకోసం వ్యయ, ప్రయాసలు ఎదుర్కొవాల్సి వస్తోంది.

– నాగయ్య, లబ్ధిదారుడు, కోవెలకుంట్ల

కరోనాను దీటుగా ఎదుర్కొన్నాం

కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించాం. వైరస్‌బారిన పడిన వ్యక్తుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి వైద్యసేవలందేలా కృషి చేశాం. ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపులో ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా పనిచేశాం. వలంటీర్ల సేవలను గుర్తించి ప్రస్తుత ప్రభుత్వం వలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.

– సౌజన్య , వలంటీర్‌, వల్లంపాడు,

కోవెలకుంట్ల మండలం

వలంటీర్లను మరిచిపోలేం

గతంలో వలంటీర్లు ఉన్నప్పుడు పింఛన్లతో పాటు అన్ని ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దకు వచ్చి అందించేవారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకండా ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందేవాళ్లం. అలాగే వలంటీర్లు ఆసుపత్రికి కూడా తీసుక పోయేవారు. ప్రస్తుతం నేను పక్షవాతంతో మంచంలో ఉన్నాను. గతంలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా వలంటీర్లు వైద్య చూపించి ఇంటివద్ద విడిచి వెళ్లేవారు. – సువార్తమ్మ, క్రిష్టిపాడు

  వలంటీర్‌ వ్యవస్థను    కొనసాగించాలి 
1
1/3

వలంటీర్‌ వ్యవస్థను కొనసాగించాలి

  వలంటీర్‌ వ్యవస్థను    కొనసాగించాలి 
2
2/3

వలంటీర్‌ వ్యవస్థను కొనసాగించాలి

  వలంటీర్‌ వ్యవస్థను    కొనసాగించాలి 
3
3/3

వలంటీర్‌ వ్యవస్థను కొనసాగించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement