
‘బానకచెర్ల’కు నూతన గేట్లు
పాములపాడు: మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద నూతన గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఏఈ దేవేంద్ర శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెగ్యులేటర్ వద్ద వీబీఆర్, పాత ఎస్‌ఆర్‌బీసీ, కేసీసీ ఎస్కేప్ చానల్‌ల నూతన గేట్ల ఏర్పాటు కోసం రూ.15కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం కేసీసీ ఎస్కేప్ ఛానల్ గేట్లను రూ. 5 కోట్లతో నిర్మాణం పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసిన నూతన గేట్లను హైదరాబాదులో సీఈ కబీర్ బాషా స్వయంగా పరిశీలించారన్నారు. జూన్ చివరి నాటికి నూతన గేట్లను అమర్చి ఖరీఫ్‌కు నీటిని విడుదల చేయాలని కాంట్రాక్టర్‌కు సీఈ నుంచి ఆదేశాలు అందాయన్నారు.