
అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్
● 16 మోటార్ బైక్‌లు స్వాధీనం
ఎమ్మిగనూరురూరల్: గత కొంత కాలంగా మోటార్ బైక్‌ల దొంగతనమే తన ప్రవృత్తిగా మార్చుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ నుంచి 16 మోటార్ బైక్‌లను రికవరీ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్ అవరణలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మధుసుధన్‌రెడ్డి వివరాలు వెల్లడింఆచరు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించినట్లు చెప్పారు. సి.బెళగల్ మండలం పొలకల్ బీసీ కాలనీకి చెందిన ఉప్పరి వీరేష్, అదే గ్రామానికి చెందిన వర్థన్ అలియాస్ ఇక్బాల్, కోడుమూరుకు చెందిన అబ్దుల్ కలామ్ అలియాస్ మచ్చాలు ముఠాగా ఏర్పడి మోటార్ బైక్‌ల చోరీలకు చేయటం మొదలు పెట్టినట్లు చెప్పారు. మీరి ముగ్గురిపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో 11 , కర్నూల్ –2 టౌన్లో 2, కర్నూల్ తాలూకా స్టేషన్లో 1, సి. బెళగల్ స్టేషన్లో 1, కర్నాటక రాష్ట్రం బళ్లారి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో 1 చొప్పున కేసులు ఉన్నాయన్నారు. ఏ1 నిందితుడు ఉప్పర వీరేష్ పట్టణంలోని మంత్రాలయం రోడ్డ్ ఉప్పర కాలనీ కొట్టాల దగ్గర అనుమాన్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం రావటంతో వెళ్లి పట్టుకొన్నట్లు చెప్పారు. విచారణలో మోటార్ బైక్‌లను దొంగతనం చేసినట్లు అంగీకరించటంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. బైక్‌ల కేసులో ఇప్పటికే కోడుమూరుకు చెందిన అబ్దుల్‌కలాం అలియాస్ మచ్చా కర్నూల్ తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాడని, మరో నిందితుడు సి. బెళగల్ వర్థన్ అలియాస్ ఇక్బాల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. పట్టబడిన 16 మోటార్ బైక్‌ల విలువ రూ. 16.50 లక్షలు ఉంటుందని తెలిపారు.