
ఆటో బోల్తా .. డ్రైవర్ మృతి
బేతంచెర్ల: మండల పరిఽధిలోని గూటుపల్లె గ్రామ సమీపాన ఆటో బోల్తాపడిన సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. గూటుపల్లె గ్రామానికి చెందిన రామచంద్రుడు (42)ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. బుధవారం హుసేనాపురం సమీపాన భవన నిర్మాణానికి సెంట్రింగ్ చెక్కల బాడుగ ఉండటంతో వెళ్లి వస్తున్నాడు. గూటుపల్లె సుంకులమ్మ ఆలయం సమీపాన ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమార్తె ఉదయ లక్ష్మి ఉన్నారు.