నంద్యాల(అర్బన్): జిల్లాలోని మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి లక్ష్మీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల ప్రవేశాలకు 4వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులని, ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, 16వ తేదీ పరీక్ష ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్ https://mjpapbcwrei. apcfss.in లో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.


