నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందండి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందండి

Apr 7 2026 8:19 AM | Updated on Apr 7 2026 8:19 AM

రామగిరి (నల్లగొండ), కనగల్‌ : రైతులు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి కోరారు. సోమవారం నల్లగొండ మండల పరిధిలోని తొరగల్‌, ఎం.దుప్పలపల్లి, కొత్తపల్లి, అప్పాజీపేట, నర్సింగ్‌భట్ల, కుదావన్‌పూర్‌, చిన్న సూరారంతోపాటు కనగల్‌ మండలం కనగల్‌, తేలకంటిగూడెం, పర్వతగిరి, చర్లగౌరారం, ఏమిరెడ్డిగూడెం, లింగాలగూడెం, దోరెపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్‌ కల్పిస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంటాలు వేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీడీఓ యాకూబ్‌, ఏఓ శ్రీనివాస్‌, ఏపీఎం వినోద, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఐకేపీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధిహామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర

కట్టంగూర్‌ : ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్‌ మండలం పిట్టంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీల సమస్యలను తెలుసుకుని మాట్లాడారు. బీజేపీ కూటమి ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరు తొలగించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు ఇవ్వాలని షరతు పెట్టడంతో భవిష్యత్‌లో ఉపాధి హామీ పనులు కనుమరగయ్యే ప్రమాదం ఉందన్నారు. కూలీలకు ఉపాధి పనులను దూరం చేసి వారి పొట్టగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కారింగు రమణ, వంగా మహేశ్వరి, నవనీత, లక్ష్మి, తోటకూరి యాదమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement