హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి | - | Sakshi
Sakshi News home page

హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి

Apr 6 2026 7:30 AM | Updated on Apr 6 2026 7:30 AM

న్యూస్‌రీల్‌

ప్రారంభమవుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు

సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

నల్లగొండ : ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. పది రోజుల క్రితమే కోతలు ప్రారంభమై పెద్ద ఎత్తున ధాన్యం కల్లాలకు వస్తుండడంతో.. అధికారులు కొనుగోలు కేంద్రాలను తెరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 401 కేంద్రాలను తెరవాలని నిర్ణయించిన అధికారులు ఆదివారం వరకు 16 కేంద్రాలను ప్రారంభించారు. కానీ కాంటాలు మాత్రం ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

12 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి

యాసంగి సీజన్‌లో 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు మిల్లు నేరుగా కొనుగోలు చేస్తాయని, మిగిలిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వస్తుందని లెక్కలు వేశారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 401 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత యాసంగి కంటే ఈసారి అధికంగా దాన్యం వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 2న సందర్భంగా చిట్యాలలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆదివారం నల్లగొండలోని ఆర్జాలబావిలో కార్పొరేషన్‌ మేయర్‌ బుర్రి చైతన్య, కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

వేచి చూసే ధోరణిలో యంత్రాంగం

గత యాసంగి సీజన్‌్‌లో ఏర్పాటు చేసిన చోటనే ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో రైతులు ముందుగానే ఆయా ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించి ఆరబెడుతున్నారు. ప్రస్తుతం వేసవి ఎండలు అధికంగా ఉంటుండటంతో నిర్దేశిత తేమ శాతం త్వరగా వచ్చేస్తోంది. అయినా జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ప్రారంభించడంలో వేచి చూసే ధోరణిలో ఉంది.

రైతులకు తప్పని పడిగాపులు

కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నా.. క్షత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 16 కేంద్రాలు ప్రారంభించినా.. కాంటాలు మాత్రం వేయడం లేదు. చాలా కేంద్రాల వద్దకు ఇంకా టార్పాలిన్లు, తేమ, తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులు కూడా రాలేదు. రైతులకు అవసరమైన నీడ, తాగునీటి వసతి కూడా కల్పించలేదు. దీంతో రైతులు రోజూ కేంద్రాల వద్ద తమ ధాన్యం ఆరబెట్టి.. సాయంత్రం కుప్పగా చేస్తూ.. రాశుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వాతావరణంలో మార్పులు సంభవించి వర్షం కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

ఫ ఈ సీజన్‌లో 401 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

ఫ ఇప్పటివరకు 16 కేంద్రాలు ప్రారంభం

ఫ ఆర్జాలబావిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మేయర్‌, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement