నల్లగొండ : సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ అని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జగ్జీవన్‌రామ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జగ్జీవన్‌రామ్ విగ్రహానికి కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. అణగారిన వర్గాల ఆశా కిరణం బాబు జగ్జీవన్‌రామ్ అన్నారు. జగ్జీవన్‌రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, చొల్లేటి ప్రభాకర్, పున్న కై లాస్ నేత, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, మారుపాక నరేందర్, పెరిక షణ్ముఖకుమార్, పాలడుగు నాగరాజు, కవితా రాణి, గోలి ఏడుకొండలు, పెరిక స్వాతి, శ్రీని వాసరావు, కత్తుల షణ్ముఖ కుమార్, జగన్ కుమార్, బుర్ర సుధాకర్, కత్తుల సంజీవయ్య, అవుట రవీందర్, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి పాల్గొన్నారు.


