నల్లగొండ టూటౌన్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో అండర్– 25 సీనియర్ క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేన్ జిల్లా కార్యదర్శి అమీనుద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న జట్టు త్వరలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ పోటీలో పాల్గొంటుందని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ వెంట బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, రెండు పాస్ పోర్ట్‌సైజ్ ఫొటోలు తీసుకొని ఉదయం 9 గంటలకు నల్లగొండలోని మేకల అబినవ్ స్టేడియానికి రావాలని సూచించారు.
రెండు రేషన్ షాపులు సీజ్
డిండి : మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, వావిల్‌కొల్ గ్రామాల్లోని రేషన్ షాపులను దేవరకొండ డీటీసీఎస్ మోబీన్ ఆదివారం సీజ్ చేసారు. వివరాల ప్రకారం మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన రేషన్ డీలర్ కొన్ని నెలల నుంచి రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా వారికి కొంత మేర నగదు అందజేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నాడని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో బ్రాహ్మణపల్లి రేషన్ షాపుతోపాటు అదే డీలర్ ఇన్‌చార్జిగా నిర్వహిస్తున్న వావిల్‌కొల్ రేషన్ షాపుల్లో తనిఖీలు చేశారు. దీంతో రెండు షాపుల్లో నిల్వ ఉన్న సరుకుల్లో తేడాలు రావడంతో సదరు డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసినట్లు డీటీసీఎస్ పేర్కొన్నారు. రేషన్ బియ్యం పంపీణీలో అవకతవకలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
సిద్ధాంతం కలిగిన పార్టీలకే ఆదరణ
మోత్కూరు : సైద్ధాంతిక సిద్ధాంతం కలిగిన పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం మోత్కూరులో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసినప్పుడే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాగలుగుతుందన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలన్నారు. బీజేపీ మున్సిపల్ శాఖ అధ్యక్షురాలు చాడ మంజులరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు, ప్రశిక్షణ ప్రభారి గౌరు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గూదె మధుసూదన్, నాయకులు కె.నాగార్జున్‌రెడ్డి, బయ్యని చంద్రశేఖర్, ఏనుగు జితేందర్‌రెడ్డి, పోచం సోమయ్య, సజ్జనం మనోహర్, చేకూరి మల్లేశం, కూరాకుల వెంకన్న, సైదులు, ఏనుగు జితేందర్‌రెడ్డి, సజ్జనం మనోహర్, రమణ, సోమేశ్వరి, రేణుక, రాము, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


