మూడో విడత సిబ్బంది ర్యాండమైజేషన్
నల్లగొండ : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా దేవరకొండ డివిజన్‌లోని మండలాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్‌ను సోమవారం కలెక్టరేట్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, కలెక్టర్ ఇలా త్రిపాఠి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 17న దేవరకొండ డివిజన్ పరిధిలోని చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము, పీఏపల్లి మండలాల్లోని 2,206 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 2,647 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2959 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఆర్‌డీఓ రమణారెడ్డి, డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు, డీఈఓ భిక్షపతి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, ఈ– జిల్లా మేనేజర్ దుర్గారావు, ఎన్‌ఐసీ ప్రతినిధి ప్రేమ్ పాల్గొన్నారు.


