నార్కట్‌పల్లి డిపోను పరిశీలించిన ఎండీ | - | Sakshi
Sakshi News home page

నార్కట్‌పల్లి డిపోను పరిశీలించిన ఎండీ

Dec 16 2025 4:53 AM | Updated on Dec 16 2025 4:53 AM

నార్క

నార్కట్‌పల్లి డిపోను పరిశీలించిన ఎండీ

నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలో నార్కట్‌పల్లి డిపోను పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే బస్సుల వివరాలను ఆర్టీసీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ డిపో ఎప్పుడు ప్రారంభమైంది.. ఎన్ని బస్సులు ఉన్నాయి.. అనే పూర్తి వివరాలను నల్లగొండ ఆర్‌ఎం జాన్‌రెడ్డి ఆయనకు వివరించారు. అంతకు ముందు ఆయన డిపోలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం సుచరిత, ప్రభాకర్‌, కర్నాటి శ్రీనివాస్‌, చారి, బెల్లి సత్తి, సమత పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి

గుర్రంపోడు : కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌ నేత అన్నారు. సోమవారం గుర్రంపోడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామగ్రామాన కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య, సర్పంచ్‌ అభ్యర్థి కుప్ప అమరేందర్‌గౌడ్‌, నాయకులు కుప్ప రాములు, చనమల్ల జగదీశ్వర్‌రెడ్డి, షేక్‌ సయ్యద్‌మియా, పగిళ్ల లాలయ్య, మండలి లింగయ్య, కుప్ప సురేందర్‌, మేడి వెంకన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

నాటికల సంపుటి ఆవిష్కరణ

రామగిరి(నల్లగొండ) : నాటక రచయిత గజవెల్లి సత్యం రచించిన ‘ఓ మహిళా మేలుకో’ నాటికల సంపుటిని నల్లగొండ పట్టణంలోని పెన్షనర్స్‌ భవనంలో ఆలిండియా పెన్షనర్స్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ డి.సుధాకర్‌ సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఉద్యోగులు జి.వెంకట్‌రెడ్డి, గాయం నారాయణరెడ్డి, ఎంవీ.గోనారెడ్డి, ఎం.పురుషోత్తమచార్యులు, తడకమళ్ల రాంచందర్‌రావు, జెల్లా శ్రీశైలం, మారోజు కేశవాచారి, టి.రమేష్‌, భిక్షం తదితరులు పాల్గొన్నారు.

జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

నల్లగొండ టౌన్‌ : ఏపీలో విశాఖపట్నంలో ఈ నెల 31 నుంచి జనవరి 1, 2, 3, 4 తేదీల్లో జరిగే సీఐటీయూ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సీఐటీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీఐటీయూ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎండీ సలీం, దండెంపల్లి సత్తయ్య, అవుట రవీందర్‌, అద్దంకి నర్సింహ, గంజి నాగరాజు, సైదాచారి, లింగయ్య, నర్సింహ, శ్యాంసుందర్‌, పల్లె నగేష్‌, రాజేష్‌, యాదయ్య, అనురాధ, శ్రీవాణి, వెంకన్న, సోములు, శంకర్‌, లక్ష్మిపతి, ధనమ్మ, మల్లయ్య, లింగస్వామి, బుచ్చిరాములు, వెంకటేశం పాల్గొన్నారు.

నార్కట్‌పల్లి డిపోను పరిశీలించిన ఎండీ1
1/3

నార్కట్‌పల్లి డిపోను పరిశీలించిన ఎండీ

నార్కట్‌పల్లి డిపోను పరిశీలించిన ఎండీ2
2/3

నార్కట్‌పల్లి డిపోను పరిశీలించిన ఎండీ

నార్కట్‌పల్లి డిపోను పరిశీలించిన ఎండీ3
3/3

నార్కట్‌పల్లి డిపోను పరిశీలించిన ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement