తుది విడత పోరుకు సన్నద్ధం
దేవరకొండ : దేవరకొండ డివిజన్‌లో జరుగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 17న పోలింగ్ జరుగనుండగా సోమవారంతో ముగిసింది. దీంతో ఆయా ప్రధాన పార్టీల మద్దతుదారులు, రెబల్ అభ్యర్థులు ప్రలోబాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు సమకరించాలని అధికారులు కోరుతున్నారు.
9 మండలాల్లో ఎన్నికలు
దేవరకొండ డివిజన్‌లో దేవరకొండ, చింతపల్లి, పీఏపల్లి, నేరేడుగొమ్ము, చందంపేట, కొండమల్లేపల్లి, గుర్రంపోడు, డిండి, గుడిపల్లి మండలాలకు సంబంధించి ఆయా మండల కేంద్రాల్లో అధికారులు డీఆర్సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేడు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సామగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు బందోబస్తు నడుమ చేరుకోనున్నారు.
7గంటల నుంచి పోలింగ్
ఈనెల 17న డివిజన్ పరిధిలోని పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుండగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. డివిజన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించిన పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు.
ఫ రేపు పంచాయతీ మూడో విడత ఎన్నికలు
ఫ సోమవారంతో ముగిసిన ప్రచారం
ఫ 227 గ్రామాల్లో పోలింగ్


