ధనుర్మాస శోభ
ఫ నేటి నుంచి జనవరి 14 వరకు
వైష్ణవ ఆలయాల్లో ఉత్సవాలు
రామగిరి(నల్లగొండ) : జిల్లాలో ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతాయి. వేంకటేశ్వరస్వామి, శ్రీరామ మందిరాలు ధనుర్మాస ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. ఆయా ఆలయాల్లో రోజూ తెల్లవారుజామున అష్టోత్తర శత నామావళి, తులసి మాల కై ంకర్యం, గోదా దేవి విరచిత పాశరాల పఠనం చేపడుతారు. సాయంత్రం పుష్పాలంకరణలు, కుంకుమార్చన, పల్లకి సేవలు నిర్వహిస్తారు. జనవరి 11న కుడారై ఉత్సవంలో 108 కాంస్య పాత్రల్లో పాయసం నివేదన చేస్తారు. 14వ తేదీన గోదా రంగనాథుడి కల్యాణ మహోత్సం శాస్త్రోత్తంగా నిర్వహిస్తారు.


