సాగర్‌లో ఆక్టోపస్ మాక్‌డ్రిల్
నాగార్జునసాగర్ : సాగర్ ప్రాజెక్టు పరిధిలో సామవారం ఆక్టోపస్ దళాలు మాక్‌డ్రిల్ నిర్వహించాయి. దేశంలోని పలు ప్రాంతాలకు ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసేందుకు మాక్‌డ్రిల్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆక్టోపస్ దళాలు డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌లోని ప్రధాన జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రం పరిసర ప్రాంతాలు, పవర్‌హౌజ్ లోపలి భాగాలను పరిశీలిస్తూ మారఖ డ్రిల్ నిర్వహించారు. ఈ తరహా మాక్‌డిల్స్ ద్వారా భద్రతా సిబ్బందికి మరింత అవగాహన, పలుశాఖల మధ్య సమన్వయం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ మాక్‌డ్రిల్‌లో ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులు స్థానిక పోలీసు అధికారులు, సీఆర్‌పీఎఫ్ దళాలు, ఎస్‌పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


