సర్పంచ్‌లకు హరీష్‌రావు సత్కారం
నాంపల్లి, మర్రిగూడ : నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉస సర్పంచ్, వార్డు సభ్యులను మాజీ మంత్రి హరీష్‌రావు సోమవారం ఘనంగా సత్కరించారు. కొత్తగా గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని మాజీ మంత్రి హరీష్‌రావ్ దిశానిర్దేశం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ మాతృమూర్తి, సోదరుడి ప్రథమ వర్ధంతికి హజరయ్యారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్, నాయకులు పాల్వాయి స్రవంతి, నర్సింహారావు, సర్పంచ్ నక్క చంద్రశేఖర్, ఇట్టెం వెంకట్‌రెడ్డి, రోరె ప్రమీల, రాములు, చరణ్, కర్నె యాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, సర్పంచ్‌లు రొక్కం భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్, ఆంబోతు తులసీరామ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


